Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా Telugu Christian Song Lyrics

నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా Lyrics

నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల  ||నీవు||

1. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు (2)
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4)    ||నీవు||

2. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా (2)
నేనే జీవము అని పలికిన దేవా (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4)    ||నీవు||

Your favourites

  • No Favourites found!