Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా Telugu Christian Song Lyrics

నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా Lyrics


నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా
నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా (2)
దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా
నజరేతు వాడా నను విడిచిపోకయ్యా (2)           ||నీవు||

గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా
మూగవాడినయ్యా నా స్వరమునీయవా (2)
కుంటివాడినయ్యా నా తోడు నడువవా (2)           ||దావీదు||

లోకమంత చూచి నను ఏడిపించినా
జాలితో నన్ను చేరదీసిన (2)
ఒంటరినయ్యా నా తోడు నిలువవా (2)           ||దావీదు||

నా తల్లి నన్ను మరచిపోయినా
నా తండ్రి నన్ను విడచిపోయినా (2)
తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా (2)           ||దావీదు||

Your favourites

  • No Favourites found!