Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నేనే భయపడ వలదని పలికెను మన Telugu Christian Song Lyrics

నేనే భయపడ వలదని పలికెను మన Lyrics

నేనే భయపడ వలదని పలికెను
మన రక్షకుడు యేసుప్రభు
1. తన సమాధానము నీ కిచ్చి - కృపల నెన్నో చూపెనుగా
తనివి తీర స్తుతి చెల్లించుము - తనదు ప్రేమదయకొరకు
2. శాశ్వతంబగు జాలిజూపి - శాశ్వతరక్షణ నొసగి
విశ్వాసముతో నిలచిన యెడల - శాశ్వత రాజ్యం బొసగు
3. నరుడుకాడు దేవుడతడు - నరుడు ఆయెను నీ కొరకు
కరుణతో నిను రక్షించుటకు - సర్వమిచ్చెను శ్రీ యేసు
4. మరణించెను ప్రభు నీ కొరకే - తిరిగి లేచెను కాపాడన్
త్వరగ వచ్చును కనిపెట్టుము - నిరతమాయనతోనుండ
5. ఎంత పాపివైన నిలలో - చింత లేదిక నమ్మినచో
వింత రక్షకుడేసు ప్రభువు - స్వంత ప్రాణమునర్పించె
6. నీదుయాత్రలో బలమిచ్చుటకు - తనదు దేహరక్తమును
ముదముతో అర్పించిన ప్రభుకే - హల్లెలూయా పాడుము


Your favourites

  • No Favourites found!