Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌ నిత్యము Telugu Christian Song Lyrics

నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌ నిత్యము Lyrics

నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్‌ (2)
అంతా నా మేలుకే – ఆరాధనా యేసుకే
అంతా నా మంచికే – (తన ఛచిత్తమునకు తల వంచితే) (2)
అరాధన ఆపను – స్తుతియించుట మానను (2)
స్తుతియించుట మానను
|| నేనెల్లప్పుడు ||

1. కన్నీల్లే పానములైన – కఠిన దుఃఖ బాధలైన
స్థితిగతులే మారిన – అవకాశం చేజారిన
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2)
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2)
|| అంతా నా మేలుకే ||

2. ఆస్తులన్ని కోల్పొయిన – కన్నవారే కునుమరుగైన
ఊపిరి బరువైన – గుండెలే పగిలినా
యెహోవా యిచ్చెను – యెహోవా తీసికొనెను (2)
ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక  (2)
|| అంతా నా మేలుకే ||

3. అవమానం ఎంతైన – నా వారే కాదన్న
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా ?
నీవు నా కుండగా – ఏది నాకక్కర లేదు (2)
నీవు నా కుండగా – ఏది నాకక్కర లేదు (2)
|| అంతా నా మేలుకే ||

4. ఆశలే సమాధియైన – వ్యాధి బాధ వెల్లువైన
అధికారము కొప్పుకొని – రక్షణకై ఆనందింతున్‌
నాదు మనస్సు నీ మీద – ఆనుకొనగ ఓ నాధా (2)
పూర్ణశాంతి నే పొంది నిన్నే నే కీర్తింతున్‌ (2)
|| అంతా నా మేలుకే ||

5. చదువులే రాకున్న – ఓటమి పాలైన
ఉద్యోగం లేకున్న – భూమికే బరువైన
నా యెడల నీ తలంపులు – ఎంతో ప్రియములు  (2)
నీవుద్దేశించినది నిష్ఫ్టలము కానేరదు (2)
|| అంతా నా మేలుకే ||

6. సంకల్పాన పిలుపొంది – నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి – మేలుకై జరుగును
యేసుని సారూప్యము నేను పొందాలని (2)
అనుమతించిన ఈ – విలువైన సిలువకై  (2)
|| అంతా నా మేలుకే ||

7. నీవు చేయునది – నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను – తెలిసికొందును
ప్రస్తుతము సమస్తము – దుఃఖ కరమే (2)
అభ్యసించిన నీతి – సమాధాన ఫలమే  (2)
|| అంతా నా మేలుకే ||

Your favourites

  • No Favourites found!