నేను ఘోరపాపిని చేరి వేడుచుంటిని క్షమించుము
1. ఆదాము హవ్వలందున ఏదేనులో నే పొందిన
ఆది దోషము అంటియుండెనయ్య – దాని నిర్మూలించు యేసయ్య
2. నా తల్లి గర్భమందున అవతరించుట తోడనే
పాపము తోడనే పుట్టితి నేసయ్యా – దాని పరిహరింపుము
3. నా యపరాధము చేతను నే జేసిన పాపమందున
సత్యములేక నేజచ్చిన వాడను – ననుజీవింపచేయు యేసయ్యా
4. పాపములు దాచుకొంటిని శాపమును గూర్చుకొంటిని
ఆపద గుర్తించ లేక నే గడిపితిని – దాపు జేరితి ప్రాపునీయుము
5. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత లేకను
పచ్చిపుండ్లు గాయములతో నేసయ్యా – వచ్చి నీ ప్రాపున జేరితి
6. లోకానంద యంద మందున వీకతో వీక్షింపనేగితి
దావీదువలె బెత్షెబా బారిలో నుంటి – దేవా విమోచించు యేసయ్యా
7. ఎన్నెనోమార్లు నీ సన్నిధిన్ నేను విడిచి ఏతెంచితి
నావలె మీనాగర్భములో నుంటి – నన్ను నీదరిజేర్చు మేసయ్యా
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నేను ఘోరపాపిని చేరి వేడుచుంటిని క్షమించుము Lyrics
Your favourites
- No Favourites found!
