Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా Telugu Christian Song Lyrics

నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా Lyrics

నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా – (2)

నేను ఓడిపోనయా – నా పక్షానుండగా
నేను కృంగిపోనయా – నీవు నా తోడుండగా (2)
నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా (2)
నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా (2)         ||నేను ఓడిపోనయా||

అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే
వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే (2)
ఖ్యాతినిచ్చి ఘనతా నిచ్చి మంచి పేరు నాకిచ్చావే (2)
శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే         ||నేను ఓడిపోనయా||

నిందలన్ని పొందిన చోటే ఘనతనిచ్చినావే
నా శత్రువులేదుటే నాకు విందు చేసినావే (2)
ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే (2)
శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే         ||నేను ఓడిపోనయా||

నన్ను చూచి నవ్వినచోటే నా తలపైకెత్తినావే
నన్ను దూషించిన చోటే దీవించినావే (2)
ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే (2)
శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే         ||నేను ఓడిపోనయా||

Your favourites

  • No Favourites found!