Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి Telugu Christian Song Lyrics

నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి Lyrics

నేను తగ్గాలి యేసు - నీవే హెచ్చాలి
నేను పూర్తిగా మరుగై - నీవే కనబడాలి
ఇదియే నా ప్రార్థన - నీ చిత్తము
1. నేను యేసుతో కూడ - సిలువ వేయబడాలి
నా స్వార్థ జీవితమంతా - లయమైపోవాలి
యేసుని స్వభావమునాలో - అధికమౌతు ఉండాలి
పరలోక జీవమునాలో అభివృద్ధి చెందాలి
2. ఆదాము పాపమునాలో - వశియించియుండగా
యేసుని రక్తమోదాని - నశియింపచేయును
ఆటంకమేమియు లేక - జీవధారలుండాలి
యేసుని జీవమునాలో - నింపబడుతుపోవాలి
3. ప్రాచీన స్వభావమంత - సిలువ్ వేయబడాలి
దాని ప్రభావమంత - లయమై పోవాలి
అన్నిటిలో పాత స్వభావం - తొంగి తొంగి చూస్తుంది
ప్రతిదినము యేసుప్రభువే - నాలో వృద్ధి చెందాలి
4. ఇహలోక కోరికలన్ని - సిలువవేయబడాలి
ప్రభువైన యేసుకునాలో - ప్రథమ స్థానముండాలి
శరీరేచ్ఛలన్ని మృతమై - ఆత్మీయతరావాలి
ఆత్మీయ జీవము నాలో - అభివృద్ధి చెందాలి
5. లోకమంతయునాకై - సిలువ వేయబడాలి
లోకముకై నేను కూడ - మృతమై పోవాలి
కాదు లోకం యేసేనాలో - ఘనపరచబడాలి
ఆశలన్నినావి యేసులో - దాగిపోయి ఉండాలి
6. నా శేష జీవితమంతా - యేసుకే సమర్పితమై
ఆయన మహిమా స్వరూపం - పొంది మార్పు చెందాలి
ఒకదినాన యేసుని రూపం - నాలో కనబడాలి
మెట్టు మెట్టుకు ఆయన పోలిక - నాలో ఏర్పడాలి


Your favourites

  • No Favourites found!