Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నేను వెళ్ళే మార్గము – నా Telugu Christian Song Lyrics

నేను వెళ్ళే మార్గము – నా Lyrics

నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును
శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను (2)     ||నేను||

కడలేని కడలి తీరము – ఎడమాయె కడకు నా బ్రతుకున (2)
గురిలేని తరుణాన వెరువగ – నా దరినే నిలిచేవ నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ (2)

జలములలోబడి నే వెళ్లినా – అవి నా మీద పారవు (2)
అగ్నిలో నేను నడచినా – జ్వాలలు నను కాల్చజాలవు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ (2)

విశ్వాస నావ సాగుచు – పయనించు సమయాన నా ప్రభు (2)
సాతాను సుడిగాలి రేపగా – నా యెదుటే నిలిచేవా నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ (2)         ||నేను||

Your favourites

  • No Favourites found!