నేను వెళ్ళే మార్గము
నా యేసుకే తెలియును (2)
శోధించబడిన మీదట
నేను సువర్ణమై మారెదను (2) ||నేను ..||
1. కడలేని కడలి తీరము
ఎడమాయె కడకు నా బ్రతుకున (2)
గురిలేని తరుణాన వెరువగ
నా దరినే నిలిచేవ నా ప్రభు (2)
హల్లేలూయా హల్లేలూయా
హల్లేలూయా ఆమేన్ (2) ||నేను ..||
2. జలములలోబడి నే వెళ్లినా
అవి నా మీద పారవు (2)
అగ్నిలో నేను నడచినా
జ్వాలలు నను కాల్చజాలవు
హల్లేలూయా హల్లేలూయా
హల్లేలూయా ఆమేన్ (2) ||నేను ..||
3. విశ్వాస నావ సాగుచు
పయనించు సమయాన నా ప్రభు (2)
సాతాను సుడిగాలి రేపగా
నా యెదుటే నిలిచేవా నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా
హల్లేలూయా ఆమేన్ (2) ||నేను ..||
