Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నేను వెళ్ళే మార్గము నా యేసుకే Telugu Christian Song Lyrics

నేను వెళ్ళే మార్గము నా యేసుకే Lyrics

నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును -2
శోధించబడిన మీదట - నేను సువర్ణమై మారెదను -2
నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును

1. కడలేని కడలి తీరము - యెడమాయె కడకు నా బ్రతుకున -2
గురిలేని తరుణాన వేరువగా - నా దరినే నిలిచేవా నా ప్రభూ -2
నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును

2. జలములలో బడి నేను వెళ్ళినా - అవి నా మీద పారవు -2
అగ్నిలో నేను నడచినను - జ్వాలలు నను కాల్చజాలవు -2
నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును

3. విశ్వాస నావ సాగుచూ - పయనించు సమయాన నా ప్రభూ -2
సాతాను సుడిగాలి రేపగా - నా యెదుటే నిలిచేవ నా ప్రభు -2
నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును -2
శోధించబడిన మీదట - నేను సువర్ణమై మారెదను -2
నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును

Your favourites

  • No Favourites found!