నేనును నా యింటివారును నీతి సూర్యుని గొలుతుము దీనమనసును
గలిగి దేవుని దివ్యసేవను జేతుము||
1. అనుదినంబును ప్రభుని దలచుచు అలయకను ప్రార్థింతుము అనవరత
మా ప్రభుని చిత్తము ననుకరింతుము పనులలో ||
2. వేదవాక్య పఠనమందు విసుగు జెందక నుందుము ఆదరంబున
దైవ చిత్తము ననుసరించుచు నడుతుము||
3. ఆశతోడను ప్రభుని దినమును నాచరింతుము మరువక విసుకు జెందక
నాలయమునకు పిన్న పెద్దల దెత్తుము ||
4. సంఘ కార్యక్రమములందు సహకరింతుము ప్రతీతో భంగ పరచెడి
పనులన్నిటి కృంగదీసెదమనిశము ||
5. ప్రేమతోడను పొరుగువారిని ప్రియులుగను భావింతుము క్షమయు
స్నేహము నేర్చి ప్రభుకడ శాంతితో జీవింతుము ||
6. శక్తిగొలది శరీరబలమును శ్రమను క్రీస్తుకు నిత్తుము భక్తితో
హృదయమును పూర్తిగ ప్రభునికే యర్పింతుము ||
7. చిన్నవారలు దైవరాజ్యపు చిఱుత వారసులంచును అన్నివేళల వారి
వృద్ధికి మిన్నగ దోడ్పడెదము ||
8. పెద్దవారలు దైవజనులని పేర్మితో భావింతుము శుద్ధుడగు ప్రభు క్రీస్తు
మనసును శ్రద్ధతోడను జూపుచు ||
9. జీవితంబున ప్రభుని ప్రేమా శ్శీసులను ప్రసరింతుము దివ్యజ్యోతుల
రీతి వెలుగుచు దివ్యసన్నిధి నుందుము ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నేనును నా యింటివారును నీతి సూర్యుని Lyrics
Your favourites
- No Favourites found!
