Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నేనునూ నా ఇంటి వారును యెహోవాను Telugu Christian Song Lyrics

నేనునూ నా ఇంటి వారును యెహోవాను Lyrics


నేనునూ నా ఇంటి వారును
యెహోవాను సేవించెదము
ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని (2)
సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని ||నేనునూ||
శ్రమలో శోధనలో మరణ బంధకంలో
శాంతి సమాధానం దయచేసి దేవుడు (2)
ఆశా నిరాశలలో ఆవేదన వలయంలో (2)
ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు (2) ||నేనునూ||
ఏ పాపము నన్ను ఏలనీయని వాడు
ఏ అపాయమును రాకుండా కాపాడును (2)
కునుకు పాటు లేనివాడు నిదురపోని దేవుడు (2)
నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు (2) ||నేనునూ||
దీర్ఘాయువు చేత దీవించు దేవుడు
దీర్ఘ శాంతముతో దీనత్వము నేర్పును (2)
మేలు చేత నా హృదయం తృప్తిపరచు దేవుడు (2)
మేలు చేత కీడునెలా జయించాలో నేర్పును (2) ||నేనునూ||

Your favourites

  • No Favourites found!