Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నేర్చుకొనరే యేసువాడుక లనుదినము మీ బ్రతుకునందుననేర్చుకొనిన Telugu Christian Song Lyrics

నేర్చుకొనరే యేసువాడుక లనుదినము మీ బ్రతుకునందుననేర్చుకొనిన Lyrics

నేర్చుకొనరే యేసువాడుక లనుదినము మీ బ్రతుకునందున
నేర్చుకొనిన మీరలాయన జనముగ నొప్పుదురు ఇలలో ||నేర్చుకొనరే||

1. ఆలయ ఆరాధనలకు బోయెడియలవాటుగలిగియు చాలమారులు
ఆలయమునకు అరగిన యా ప్రభుని వాడుక ||నేర్చుకొనరే||

2. దేవవాక్య పఠనమందున దీక్షగలిగియు మరియ సుతుడు దివ్యముగ
నా గ్రంథ పఠనము జేసినవిధంబు మీరలు ||నేర్చుకొనరే||

3. పరమ తండ్రికి ప్రార్థనలు ప్రతివేళ జేయుట పరమవిధియని మరువకను
ప్రార్ధించి మనలను నిరతమును ప్రార్ధింపమనెను ||నేర్చుకొనరే||

4. బీద పాపులు బాధితులు బంధింపబడిన వారి కెల్లను ఆదరము
జూపించి మేలును జేసిన విధంబు మీరలు ||నేర్చుకొనరే||

5. సువార్త ప్రకటనజేయుట సుభాగ్యముగ దానెంచి యీ భువి సేవలో
సువార్త జాటుచు సంచరించిన యేసు వాడుక ||నేర్చుకో||

6. అక్కరలలో దన్నుజేరి మక్కువతో బ్రార్ధించి వేడిన పెక్కు జనముల
యక్కరలను జక్కగ దీర్చిన విధంబును ||నేర్చుకొనరే||

7. దైవచిత్తము దీర్చుటయే తన ధర్మ విధిగ నెరిగి యాయన ధరణిలో నా
ధర్మమునకై మరణమొందిన విభుని మాదిరి ||నేర్చుకొనరే||

Your favourites

  • No Favourites found!