నేర్పించుము దేవా ఆత్మీయ జీవితం
నడిపించుము నన్ను నీ అడుగు జాడలలో (2)
కుడి ఎడమలు నన్ను తొలగనీయక
లోక మాలిన్యమే అంటనీయక (2)
నా గమ్యము నీవే యేసయ్యా
నిన్ను చేరాలని నాలో ఆశయ్యా
|| నేర్పించుము ||
1. అంతుచిక్కని ఈ అరణ్య మార్గములో
దైవరహస్యములు వినిపించుము (2)
అల్లరిమూకల సమూహము నన్ను తరిమినను
నిర్మలమైన హృదయముతో నీతో నడుపుము (2)
|| నా గమ్యము ||
2. కలతలు నన్ను కలవర పెట్టినను
ఆత్మీయత నాలో చెదరనీయకుము (2)
ఆవేదనలు నాలో నిండియున్నను
ఆనందము నాలో విడిపోనియకుము (2)
|| నా గమ్యము ||
3. విజయ ఘనతలో ఉప్పొంగనీయక
దీన మనసుతో ఒదుగుట నేర్పుము (2)
శిల లాంటి నాలో నీ జీవము నింపి
నీ ఆశయాలు నాలో నెరవేర్చుమయా (2)
|| నా గమ్యము ||
