Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నేర్పించుము దేవా ఆత్మీయ జీవితం నడిపించుము నన్ను Telugu Christian Song Lyrics

నేర్పించుము దేవా ఆత్మీయ జీవితం నడిపించుము నన్ను Lyrics

నేర్పించుము దేవా ఆత్మీయ జీవితం
నడిపించుము నన్ను నీ అడుగు జాడలలో  (2)
కుడి ఎడమలు నన్ను తొలగనీయక
లోక మాలిన్యమే అంటనీయక  (2)

నా గమ్యము నీవే యేసయ్యా
నిన్ను చేరాలని నాలో ఆశయ్యా
                                         || నేర్పించుము ||
1. అంతుచిక్కని ఈ అరణ్య మార్గములో
దైవరహస్యములు వినిపించుము  (2)
అల్లరిమూకల సమూహము నన్ను తరిమినను
నిర్మలమైన హృదయముతో నీతో నడుపుము  (2)
                                          || నా గమ్యము ||
2. కలతలు నన్ను కలవర పెట్టినను
ఆత్మీయత నాలో చెదరనీయకుము  (2)
ఆవేదనలు నాలో నిండియున్నను
ఆనందము నాలో విడిపోనియకుము  (2)
                                          || నా గమ్యము ||
3. విజయ ఘనతలో ఉప్పొంగనీయక
దీన మనసుతో ఒదుగుట నేర్పుము  (2)
శిల లాంటి నాలో నీ జీవము నింపి
నీ ఆశయాలు నాలో నెరవేర్చుమయా  (2)
                                          || నా గమ్యము ||

Your favourites

  • No Favourites found!