Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీవే హృదయ సారధి – ప్రగతికి Telugu Christian Song Lyrics

నీవే హృదయ సారధి – ప్రగతికి Lyrics

నీవే హృదయ సారధి – ప్రగతికి వారధి
నీ స్నేహమే సౌభాగ్యము – సంక్షేమ సంతకం
నా పాటకే సౌందర్యము – నీవే యేసయ్యా

1.మదిలో చేదుజ్ఞాపకాల విలయ వేదిక కూల్చి (2)
చిగురాశల దిశగా నను పయనింపజేసినా
నీ మాటలు స్థిరపరచెను విశ్వాస ప్రేమలో
కలనైనా అనుకోని అనురాగ బంధమైతివే
|| నీవే హృదయ ||

2. నీవు లేని జీవితం ప్రళయసాగరమే (2)
దిక్కుతోచని సమయములో నీవేదిక్సూచివై
చుక్కానిగ నడిపించుము ఆత్మీయ యాత్రలో
కనుపాపగ నను కాచిన నామంచి కాపరి
|| నీవే హృదయ ||

3. చేరనైతి కోరనైతి స్నేహ సౌధము (2)
చిరుదివ్వెగ దరిచేరి చేర్చావు సన్నిధి
చావైనా బ్రతుకైనా నీకోసమే ప్రభు
చాటింతు నీ ప్రేమను ప్రణుతింతు ప్రేమ సాగరా
|| నీవే హృదయ ||

Your favourites

  • No Favourites found!