Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీవే హృదయ సారధి ప్రగతికి Telugu Christian Song Lyrics

నీవే హృదయ సారధి ప్రగతికి Lyrics

నీవే హృదయ సారధి – ప్రగతికి వారధి
నీ స్నేహమే సౌభాగ్యము – సంక్షేమ సంతకం
నా పాటకే సౌందర్యము – నీవే యేసయ్యా

1.మదిలో చేదుజ్ఞాపకాల విలయ వేదిక కూల్చి (2)
చిగురాశల దిశగా నను పయనింపజేసినా
నీ మాటలు స్థిరపరచెను విశ్వాస ప్రేమలో
కలనైనా అనుకోని అనురాగ బంధమైతివే
|| నీవే హృదయ ||

2. నీవు లేని జీవితం ప్రళయసాగరమే (2)
దిక్కుతోచని సమయములో నీవేదిక్సూచివై
చుక్కానిగ నడిపించుము ఆత్మీయ యాత్రలో
కనుపాపగ నను కాచిన నామంచి కాపరి
|| నీవే హృదయ ||

3. చేరనైతి కోరనైతి స్నేహ సౌధము (2)
చిరుదివ్వెగ దరిచేరి చేర్చావు సన్నిధి
చావైనా బ్రతుకైనా నీకోసమే ప్రభు
చాటింతు నీ ప్రేమను ప్రణుతింతు ప్రేమ సాగరా
|| నీవే హృదయ ||

Your favourites

  • No Favourites found!