Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడెదా Telugu Christian Song Lyrics

నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడెదా Lyrics


నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడెదా
వేకువనే లేచి నా ప్రభునే కొనియాడెదా (2)
యేసయ్యా… యేసయ్యా… స్తుతులకు పాత్రుడవు నీవయ్యా
యేసయ్యా… యేసయ్యా… మాహిమ ఘనతలు నీకయ్యా (2)        ||నిబ్బరముతో||

కష్టకాలమందు నాకు – కనికరము చూపెను
కాలుజారుతున్నవేళ – కరుణతో నిలిపెను (2)
కడుపు కాలుతున్నవేళ – నా కడుపు నింపెను
కన్నిటి బ్రతుకును – నాట్యముగా మార్చెను
కఠినమైన కాలములో – నా చెంత నిలిచెను         ||యేసయ్యా||

దిక్కుదెసలేని నాకు – దర్శనము నిచ్చెను
ధనము ఘనము లేని నాకు ఘనతనెంతో నిచ్చెను (2)
దిక్కుతోచని వేళ – నా దిక్కై నిలిచెను
దుష్ట శక్తులన్నిటిని – నాకు దూరపరచెను
దీవెనలు కుమ్మరించి – ధన్యునిగా చేసెను          ||యేసయ్యా||

Your favourites

  • No Favourites found!