Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నిదురఁ బోయినట్టి నీ పాద సేవకుని Telugu Christian Song Lyrics

నిదురఁ బోయినట్టి నీ పాద సేవకుని Lyrics

నిదురఁ బోయినట్టి నీ పాద సేవకుని సదయుఁడగు తండ్రి చక్కగా
దాచు సదమలంబగు లోకమున నీ సదనమందునఁ జేర్చి శుద్ధుల
వదల కెప్పుడు వారితో నీ పదయుగంబుల సేవఁగోరుచు ||నిదురఁ||

1. ఇతఁడీలోకమందు నీవొసంగిన పని హితమతి నొనరించె యేసుని
కృపను సతతమును బాపంబుతోడను జాల యుద్ధ మొనర్చి బ్రదుకును
నతిముదంబున నీకు నిరతము నుతు లొనర్చెడు నాశఁబూనుచు ||నిదురఁ||

2. సన్నిధిఁ జేరిన సకల వరభక్తుల కన్నీరు దుడుతువు కరుణ మీరంగ
నిన్ను నమ్మినవారి నడువడి నీవు తేటగ నెఱింగా వారికి జెన్ను గను
దీర్చె దవు న్యాయము సన్నుతింపగ సజ్జనావన ||నిదురఁ||

3. మరణ కాలంబున ధరలోఁ క్రీస్తుని సిలువ దిరముగఁ జూచిన
నరులందఱు వరదుఁడగు రక్షకుని దయచే జిరపురము నిక్కముగఁ జేరుచు
గరము నేర్తురు ప్రేమ నచ్చటఁ దరతరంబులు గడుచుచుండగ ||నిదురఁ||

4. పరిశుద్ధుఁడగు దేవ పాదసన్నిధిలోనఁ బరిపూర్ణానందము పాదు
కొని యుండు నరక బలములు చెరుపనేరవు పరమ జనకుని సుతుల
నెమ్మదిఁ జిరదయాళుఁడు గాచు వారల నిరతమును దన యాత్మ బలమున
||నిదురఁ||

5. యేసుబాధుని నమ్మి యిలను విడిచినవారు భాసిల్ల లేతురు ప్రభుశక్తి
నిలను భాసురంబగు దేహములు తన దాసు లందఱి కిచ్చి మోక్షని
వాసులముగాఁ జేసి వారల యాస దీర్చును మాటఁ దప్పక ||నిదురఁ||

Your favourites

  • No Favourites found!