Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా చెలిమి కోరి – నీ Telugu Christian Song Lyrics

నా చెలిమి కోరి – నీ Lyrics


నా చెలిమి కోరి – నీ కలిమి వీడి
నా చెంత చేరావు శ్రీమంతుడా
నా రక్షణ కొరకై – ఆ శిక్షను పొంది
బలియాగమైన నిజ స్నేహితుడా       ||నా చెలిమి||

ద్రోహినై దూరమైతిని – పాపినై పరుగులెడితిని
గమ్యమే ఎరుగనైతిని – మరణమే శరణమాయెను
ఎంతో ప్రేమించితివి – నా స్థానమందు నిలిచితివి
కృపతో నన్ రక్షించితివి – నా దోషశిక్ష భరించితివి       ||నా చెలిమి||

నిందలు అవమానములు – హేళనలు చీత్కారములు
కఠిన దెబ్బలు ముళ్లపోటులు – సిలువ భారం కాయమంతా గాయం
హృదినే బాధించినా – భరియించావు వేదన మౌనముగా
తనువే తల్లడిల్లినా – తృప్తినొందావు నను తలచుకొని       ||నా చెలిమి||

ఏ రీతి నిన్ను – కీర్తించగలను
నా నీతి నీవే ఓ యేసుదేవా
నీ సాక్షిగ నిలిచి – నీ ప్రేమను చాటి
ఘనపరతును నిన్నే ప్రియ స్నేహితుడా

Your favourites

  • No Favourites found!