Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నిజముగాఁ పరిశుద్ధు డొకఁ డీ నేలపై Telugu Christian Song Lyrics

నిజముగాఁ పరిశుద్ధు డొకఁ డీ నేలపై Lyrics

నిజముగాఁ పరిశుద్ధు డొకఁ డీ నేలపై లేఁడు వృజినములచేఁ జెడిన
మదిని బ విత్రమూలం బెటుల బొడమును ||నిజము||

1. దురిత లతలకు మూలకందము దుస్స్వభావము దానిఁ గూడిన
నరులలోఁ బరిశుద్ధ విధు లె న్నటికిఁ గనరావు నెరవుగా సద్ధర్మములనే
తెఱఁగుననుఁ గావింప నేర్తురు ధరణి లోపల ముసిఁడి చెట్టున చెఱకు
రస ముండునె తలంపగ ||నిజము||

2. మనసు క్రియ లన్నిటికి మూలం బనుచు శాస్త్రము పల్కు మఱి యా
మనసు శుచిగాకున్న నగునే తనకు క్రియాశుద్ధి అనిశ మా హృదయము
దురిచ్ఛల నలరి మిధ్యాసక్తి నుండఁగ ఘనతగల సత్యార్య ముల నిల
మనుజుఁడె ట్లొ నరింపఁజాలును ||నిజము||

3. నిరతమును పాపాగ్నిచేతను గరగుచున్న మనంబులోపల పరమ
ధర్మము భక్తి ఎటువలెఁ బాదుకొని యుండున్ నిరపరాధి యొకండు లేఁ
డని నిక్కముగఁ గనపచ్చుచున్నది పరమ దేవుఁడు క్రీస్తు కృతమునఁ
పాపులను రక్షింపవలయును ||నిజము||

Your favourites

  • No Favourites found!