నిక్కమురా లోకము చెడ్డదిరా తక్షణమే మేలుకో సోదారా
ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా
1. విన్నాననుకొంటివి కాని గ్రహియింపకున్నావా ?
చూసాననుకొంటూనే తెరువలేకున్నావా
దగ్గరగా ఉంటూనే దూరాన నిలిచేవా
త్రోవను జారా విడిచి కుడి ఎడమకు తప్పావా
పాపేచ్చలతోటి క్రీస్తేసుని మరిచావా
తన గాయములను రేపుటకు కారకుడైయున్నావా
2. శోధనల పోరుటముతో సరిపెట్టకు నీ పయనం
కష్టానష్టాలను సాకులు తప్పించవు నీ గమ్మం
పానార్పణనొందే గాని సుఖమెరుగకు అది శూన్యం
ప్రేమ విశ్వాసముతోటి నడిచేదే నీ జీవితం
నీ పరుగును కడముట్టించే నీదే మంచి పోరాటం
పరభాగ్యము నీవు పొంద ప్రకటించుము యేసుని వాక్యం
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నిక్కమురా లోకము చెడ్డదిరా తక్షణమే మేలుకో Lyrics
Your favourites
- No Favourites found!
