నింగిలోన మెరిసే – నక్షత్రం
లోకమంతటికి – వెలుగును చూప – (2)
యేసయ్య – పుట్టాడని
ఆయనే – రక్షకుడని – (2)
పూజించి – కొనియాడి
పూజించి – కొనియాడి
ఆరాధన చేద్దాం
లోకానికి – వెలుగాయెనే
పరలోకానికి – దారాయెనే (2) ||నింగిలోన||
1. నశియించి పోతున్న లోకాన్ని చూసి
చీకటిలో ఉన్న నరులను చేర (2)
వాక్యమైయున్న దేవుడు
దీనుడై భువికొచ్చినాడు (2)
పూజించి – కొనియాడి
పూజించి – కొనియాడి
ఆరాధన చేద్దాం
లోకానికి – వెలుగాయెనే
పరలోకానికి – దారాయెనే (2) ||నింగిలోన||
సర్వోత్తన్నతమైన స్థలములలో దేవునికి మహిమ
ఆయన కిష్టులైన ప్రజలందరికీ సమాధానమూ….
2. పాపంలో ఉన్న ప్రతివాని కొరకు
ప్రాణాన్ని అర్పింప పాకలో పవళించే – (2)
కరములు చాచియున్నాడు
దరి చేరితే నిన్ను చేర్చుకుంటాడు (2)
పూజించి – కొనియాడి
పూజించి – కొనియాడి
ఆరాధన చేద్దాం (2)
లోకానికి – వెలుగాయెనే
పరలోకానికి – దారాయెనే (2) ||నింగిలోన||
