Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నిన్న నేడు రేపు మారని దేవుడు Telugu Christian Song Lyrics

నిన్న నేడు రేపు మారని దేవుడు Lyrics


నిన్న నేడు రేపు మారని దేవుడు నీవు
మనుషులు మారిన మమతల తరిగిన
మార్పులేని దేవుడు నీవ్ . . (2)

1. అబ్రహామును పిలిచావు యాకోబును దర్శించావు
తరగని ప్రేమతో కృపతో నింపి మెండుగా దీవించావు
ఈనాటికైనా ఏనాటికైనా మార్పులేని దేవుడు నీవు . .

2. యోసేపును హెచ్చించావు దావీదును ప్రేమించావు
శ్రమలోనైనా ధైర్యము నింపి సర్వము సమకూర్చావు
ఈనాటికైనా, ఏనాటికైనా మార్పులేని దేవుడు నీవు . .

3. జీవపు మార్గము చూపించి ఆశ్రయ పురముకు నడిపించి
నీ దయ నాపై కురిపించి నెమ్మది కలిగించావు
ఈనాటికైనా, ఏనాటికైనా మార్పులేని దేవుడు నీవు . .

Your favourites

  • No Favourites found!