Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా Telugu Christian Song Lyrics

నిన్నే నిన్నే నే కొలుతునయ్యా Lyrics

యేసయ్యా.. యేసయ్యా..
యేసయ్యా.. యేసయ్యా..

నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా (2)
యేసయ్య యేసయ్య యేసయ్యా…

1. కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో (2)
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా||

2. ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా (2)
అండ నీవైతివయ్యా
నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా||

3. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2)
నన్ను బలపరచెనయ్యా
నిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా||

4. వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటాన (2)
కలలా కడతేర్చినావా
నీ వలలో నను మోసినావా (2) ||యేసయ్యా||

Your favourites

  • No Favourites found!