Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్య Telugu Christian Song Lyrics

నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్య Lyrics

నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్యా
నిన్నే సేవింతునయ్య (2)
నీవే నా మార్గము సత్యము జీవము
నీవేనా రక్షణ విమోచన దుర్గము (2)
నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు
నీలాంటి దేవుడు లేడయ్య  (2)
ఆరాధింతును నిన్నే ఆరాదింతును (4) || నిన్నే||

ప్రేమింతును నిన్నే ప్రేమింతును (2)
కీర్తింతును నిన్నే కీర్తింతును (2)
సేవింతును నిన్నే సేవింతును (2)

1. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచవు
మమ్మును కాపడుటకు నీవే బలిగా మారవు (2)
నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు
నీలాంటి దేవుడు లేడయ్య  (2)
ఆరాధింతును నిన్నే ఆరాదింతును (4) ||నిన్నే||

2. నేను వెతకకపోయినా నన్ను వెదకితివి
నే ప్రేమించకపోయిన నాకై ప్రాణము పెట్టితివి (2)
నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు
నీలాంటి దేవుడు లేడయ్య (2)
ఆరాధింతును నిన్నే ఆరాదింతును (4) ||నిన్నే||

Your favourites

  • No Favourites found!