Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నిన్ను కాపాడు దేవుడు కునుకడు నిదురపోడు Telugu Christian Song Lyrics

నిన్ను కాపాడు దేవుడు కునుకడు నిదురపోడు Lyrics

నిన్ను కాపాడు దేవుడు
కునుకడు నిదురపోడు – నిదురపోడు
వాగ్ధానమిచ్చి మాట తప్పడు
నమ్మదగినవాడు – నమ్మదగినవాడు
భయమేల నీకు – దిగులేల నీకు (2)
ఆదరించు యేసు దేవుడు ఉండగా          ||నిన్ను కాపాడు||

శత్రు బలము నిన్ను చుట్టుముట్టినా
శోధనలలో – నిన్ను నెట్టినా (2)
కోడి తన పిల్లలను కాచునంతగా
కాపాడు దేవుడు నీకు ఉండగా (2)
భయమేల నీకు – దిగులేల నీకు (2)
కాపాడు గొప్ప దేవుడు ఉండగా          ||నిన్ను కాపాడు||

రోగ భారమందు లేవకున్ననూ
వ్యాధులు నిన్ను కృంగదీసినా (2)
చనిపోయిన లాజరును తిరిగి లేపిన
స్వస్థపరచు దేవుడు నీకు ఉండగా (2)
భయమేల నీకు – దిగులేల నీకు (2)
స్వస్థపరచు సత్య దేవుడు ఉండగా          ||నిన్ను కాపాడు||

Your favourites

  • No Favourites found!