Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నిన్ను తలచి నను నేను మరచి Telugu Christian Song Lyrics

నిన్ను తలచి నను నేను మరచి Lyrics

నిన్ను తలచి నను నేను మరచి
నీ సాక్షిగా ఇల నే బ్రతుకుచుంటిని (2)
యేసయ్యా.. నీ కృప లేక నే బ్రతుకలేను (2)     ||నిను తలచి||

జీవము లేని దైవారాధనలో
నిర్జీవ క్రియలతో మృతుడనైతిని (2)
జీవాధిపతివై నా జీవితానికి
నిత్య జీవము నొసగిన యేసయ్యా (2)     ||నిను తలచి||

దారే తెలియని కారు చీకటిలో
బ్రతుకే భారమై నలిగిపోతిని (2)
నీతి సూర్యుడా ఎదలో ఉదయించి
బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా (2)     ||నిను తలచి||

సద్గుణ శీలుడా సుగుణాలు చూచి
హృదిలో నేను మురిసిపోతిని (2)
సుగుణాలు చూచుటకే నీవు
సిలువలో నాకై నలిగిన యేసయ్యా (2)     ||నిను తలచి||

Your favourites

  • No Favourites found!