Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నిన్ను విడిచి నీ ప్రేమ మరచి Telugu Christian Song Lyrics

నిన్ను విడిచి నీ ప్రేమ మరచి Lyrics

నిన్ను విడిచి నీ ప్రేమ మరచి -
నేనెటు పోగలను దేవా
ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు
నాదేవా నా దేవా నా దేవా (నిన్ను విడిచి)
1.దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో
నాయకుడా నా ఆర్త ధ్వని విని
నావను నడిపించినావే - తీరము చూపించినావే
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
నేనెటు పోగలను దేవా-ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు
2.శ్రమల పాలైతి సొమ్మసిల్లితి - సిలువకు నే చేరితి
శ్రీకరుడా నా శిలువను మోసి - ఆదరణె చూపినావే
నూతన బలమిచ్చినావే .... యేసయ్యా
నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా||నిన్ను||
3.విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం
శ్రీమంతడా నా షాలెము రాజా
బ్రతికెద నీ కోసమే చావైన లాభమే
నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా||నిన్ను||

Your favourites

  • No Favourites found!