Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నిను గాక మరి దేనిని – Telugu Christian Song Lyrics

నిను గాక మరి దేనిని – Lyrics

నిను గాక మరి దేనిని – నే ప్రేమింపనీయకు (2)
నీ కృపలో నీ దయలో – నీ మహిమ సన్నిధిలో
నను నిలుపుమో యేసు        ||నిను గాక||

నా తలపులకు అందనిది – నీ సిలువ ప్రేమా
నీ అరచేతిలో నా జీవితం – చెక్కించుకొంటివే
వివరింప తరమా నీ కార్యముల్
ఇహ పరములకు నా ఆధారం – నీవై యుండగా
నా యేసువా – నా యేసువా        ||నిను గాక||

రంగుల వలయాల ఆకర్షణలో – మురిపించే మెరుపులలో
ఆశా నిరాశల కోటలలో ఎదురీదు ఈ లోకంలో
చుక్కాని నీవే నా దరి నీవే
నా గమ్యము నీ రాజ్యమే – నీ రాజ్యమే
నా యేసువా – నా యేసువా        ||నిను గాక||

Your favourites

  • No Favourites found!