Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నిను పోలిన వారెవరూ – మేలు Telugu Christian Song Lyrics

నిను పోలిన వారెవరూ – మేలు Lyrics

నిను పోలిన వారెవరూ – మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితిన్ నా దేవా (2)
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని
నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య (2)
ఎల్ షడ్డాయ్ ఆరాధన – ఎలోహిం ఆరాధన
అడోనాయ్ ఆరాధన – యేషువా ఆరాధన (2)

కృంగియున్న నన్ను చూచి
కన్నీటిని తుడిచితివయ్య
కంటి పాప వలే కాచి
కరుణతో నడిపితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్||

మరణపు మార్గమందు
నడిచిన వేళయందు
వైద్యునిగా వచ్చి నాకు
మరో జన్మనిచ్చితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్||

Your favourites

  • No Favourites found!