నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో
నిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2)
ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా
నీ సన్నిధిలో…
నీ సన్నిధిలో ఆనందించే
భాగ్యమున్నా చాలు ||నిను స్తుతించినా||
1. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా
స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను||
2. ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా
స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను||
3. ఆరాధ్య దైవము నీవేనయ్యా
ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను||
4. ఆదిసంభూతుడవు నీవేనయ్యా
ఆదరించు దేవుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను||
