Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నిను స్తుతియించే కారణంఏమని చెప్పాలి ప్రభువా Telugu Christian Song Lyrics

నిను స్తుతియించే కారణంఏమని చెప్పాలి ప్రభువా Lyrics

నిను స్తుతియించే కారణం
ఏమని చెప్పాలి ప్రభువా (2)
ప్రతి క్షణము ప్రతి దినము
స్తుతియించుటే నా భాగ్యము
ప్రతి క్షణము ప్రతి దినము
స్తుతియించుటే నా జీవము ||నిను||
ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రము
అగాధ జలములలోన నీకు స్తోత్రము (2)
పరమందు నీకు స్తోత్రం
ధరయందు నీకు స్తోత్రం (2)
ప్రతి చోట నీకు స్తోత్రం
ప్రతి నోట నీకు స్తోత్రం (2) ||నిను||
చీకటి లోయలలోన నీకు స్తోత్రము
మహిమాన్విత స్థలములలోన నీకు స్తోత్రము (2)
గృహమందు నీకు స్తోత్రం
గుడిలోన నీకు స్తోత్రం (2)
ప్రతి చోట నీకు స్తోత్రం
ప్రతి నోట నీకు స్తోత్రం (2) ||నిను||
నిన్నటి మేలుల కొరకై నీకు స్తోత్రము
ఈ దిన దీవెన కొరకై నీకు స్తోత్రము (2)
శ్రమలైనా నీకు స్తోత్రం
కరువైనా నీకు స్తోత్రం (2)
ప్రతి చోట నీకు స్తోత్రం
ప్రతి నోట నీకు స్తోత్రం (2) ||నిను||

Your favourites

  • No Favourites found!