Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నిరంతరమైన నీ కృపలో నే పొందుచున్న Telugu Christian Song Lyrics

నిరంతరమైన నీ కృపలో నే పొందుచున్న Lyrics

నిరంతరమైన నీ కృపలో
నే పొందుచున్న ఆనందమే అది
అవధులు లేని ఆనందమే అది
శాశ్వతమైన ఆనందమే (2)         ||నిరంతరమైన||

అర్హతే లేని నాకు అందలము నిచ్చినావు
అపవాదినెదిరించుటకు అధికారమిచ్చినావు (2)
నా శక్తి కాదు దేవా – నీ ఆత్మ చేతనే
నీ ఘన కార్యములు వర్ణింప శక్యమే (2)         ||నిరంతరమైన||

బలహీనుడైన నన్ను బలవంతుని చేసినావు
బలమైన కార్యములను బహుగా చేయించినావు (2)
నా శక్తి కాదు దేవా – నీ ఆత్మ చేతనే
నీ ఘన కార్యములు వర్ణింప శక్యమే (2)         ||నిరంతరమైన||

మహిమా ప్రభావము నీకే చెల్లింతు మహిమోన్నతుడా
మరణమైన నిన్ను విడువను నా పరుగు ముగిసేదాకా (2)
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైతే అది ఎంతో మేలే (2)         ||నిరంతరమైన||

Your favourites

  • No Favourites found!