Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నిర్మింపబడితిమి మనము దైవగృహముగా తన కృపచే Telugu Christian Song Lyrics

నిర్మింపబడితిమి మనము దైవగృహముగా తన కృపచే Lyrics

నిర్మింపబడితిమి మనము దైవగృహముగా
తన కృపచే స్థిరపరచబడితిమి
1. కార్చెను యేసు రక్తము మనకై - కూర్చెను సంఘముగా
కృతజ్ఞతలు చెల్లించెదము - మనప్రభు యేసునకే
2. పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే
పూజనీయుని పూజించెదము - మనసార మనము
3. పరదేశులమై యున్న మనల - తన ఇంటికి జేర్చె
ప్రాపుగ మనము ప్రస్తుతింతుము - భక్తపాలకుని
4. తన కార్యమును మనలో జేసి - తన సేవకు పిలిచె
తనివి తీరగ స్తుతులర్పింతము - వినయముగా మనము
5. సంఘంబునకు శిరస్సైయున్న శ్రీ యేసు ప్రభునే
సర్వకాలము జయశబ్దముతో - సన్నుతించెదము


Your favourites

  • No Favourites found!