Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నిశ్చయముగ నిన్ను దీవించెదను నిశ్చయముగ నిన్ను Telugu Christian Song Lyrics

నిశ్చయముగ నిన్ను దీవించెదను నిశ్చయముగ నిన్ను Lyrics

నిశ్చయముగ నిన్ను దీవించెదను (2)
నిశ్చయముగ నిన్ను వృద్ధి పొందింతున్ (2)
1. ప్రత్యక్షమై పలికెనుగ ప్రభువు - సర్వశక్తిగల యెహోవాను నేను
నా సన్నిధిన్ నిర్దోషిగా నడచిన - నీతో నిబంధన నియమింతును
2. నీ సంతానమును దీవించి - నిన్ను ఫలియింప జేసెదను
నీలో నుండి జనములు వచ్చును - నీతో నిబంధన స్థిరపరతున్
3. యుగయుగములు నీకు దేవుడను - కనాను దేశము నీకొసగెదను
నిత్యస్వాస్థ్యమును నీ కొసగెదను - నీలో మహిమ నే పొందెదను
4. గొప్ప జనముగా జేసెదనిన్ను - నిశ్చయముగా ఆశీర్వదింతున్
నీనామమును గొప్ప జేసెదను - ఆశీర్వాదముగ జేసెదను
5. నిన్నాశీర్వదించువారిని - నేను ఆశీర్వదించెదను
దూషించువారిని నే శపించెదను - నీ ద్వారా దీవింపబడెదరు


Your favourites

  • No Favourites found!