Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నిత్యం నిలిచేది – నీ ప్రేమే Telugu Christian Song Lyrics

నిత్యం నిలిచేది – నీ ప్రేమే Lyrics

నిత్యం నిలిచేది – నీ ప్రేమే యేసయ్యా
నిలకడగా ఉండేది – నీ మాటే యేసయ్యా  (2)
నాతో ఉండేది – నీ స్నేహం యేసయ్యా
నాలో ఉండేది – నీ పాటే యేసయ్యా (2)     ||నిత్యం||

మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి
విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు  (2)
నీకెవరూ సాటే రారయ్యా
నీకంటే లోకంలో ఘనులెవరేసయ్యా (2)     ||నిత్యం||

ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా
అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా  (2)
నిజమైన స్నేహం నీదయ్యా
నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా (2)     ||నిత్యం||

Your favourites

  • No Favourites found!