నిత్యుడా - నీ సన్నిధి నిండుగా నా తోడూ
నిత్యముంచి నన్ను నడిపించుమా - నడిపించుమా -2
1. నీ కుడి హస్తం - హత్తుకొని యున్నది
నీ ఎడమ చేయి నా - తలక్రిందనున్నది -2
నీ కౌగిలిలోనే - నిత్యం నిలుపుమా -2 ॥ నిత్యుడా ॥
2. నీ సన్నిధిలో - నా హృదయమును
నీళ్ళవలే - కుమ్మరించునట్లు -2
నీ పాదపీఠముగా -నన్ను మార్చుమా -2 ॥ నిత్యుడా ॥
3. నీ సముఖములో - కాలుచున్న రాళ్ళవలె
నీ మనస్సు నందు - నన్ను తలంచితివా -2
నీ చిత్తమే నాలో - నేరవేర్చుమా -2 ॥ నిత్యుడా ॥
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా Lyrics
Your favourites
- No Favourites found!
