Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నూతనమైన కృప – నవనూతనమైన Telugu Christian Song Lyrics

నూతనమైన కృప – నవనూతనమైన Lyrics

నూతనమైన కృప – నవనూతనమైన కృప
శాశ్వతమైన కృప – బహు ఉన్నతమైన కృప
నిరంతరం నాపై చూపిన – నిత్య తేజుడా యేసయ్యా
నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా
నను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవధిపతి నీవయ్యా

ఇదే కదా నీలో పరవశం
మరువలేని తియ్యని జ్ఞాపకం (2)

1. నా క్రయధనముకై రుధిరము కార్చితీవి
ఫలవంతములైన తోటగా మార్చితివి (2)
ఫలితము కోరకైన శోధన కలిగినను
ప్రతి ఫలముగా నాకు ఘనతను నియమించి
ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి
అన్ని వేళలా యందు ఆశ్రయమైనావు
ఎంతగా కీర్తించినా నీ ఋణము నే తీర్చగాలనా
ఇదే కదా నీలో పరవశం
మరువలేని తియ్యని జ్ఞాపకం ||నూతన||

2. నీ వశమైయున్న ప్రాణాత్మ దేహమును
పరిశుద్ధ పరచుటయే నీ కిష్టమాయెను
పలు వేదనలలో నీతో నడిపించి
తలవంచని తెగువ నీలో కలిగించి
మదిలో నిలిచావు – మమతను పంచావు
నా జీవితమంతా నిను కొనియాడేదను
ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తీర్చగలనా
ఇదే కదా నీలో పరవశం
మరువ లేని తియ్యని జ్ఞాపకం ||నూతన||

3. సాక్షి సమూహము మేఘము వలె నుండి
నాలో కోరిన ఆశలు నెరవేరగా
వేలాది దూతల ఆనందము చూచి
కృప మహిమైశ్వర్యము నే పొందిన వేళ
మహిమలో నీ తోనే నిలిచిన వేళ
మాధుర్య లోకాన నిను చూసిన వేళ
ఎంతగా కీర్తించిన నీ ఋణము నే తీర్చగలనా
ఇదే కదా నీలో పరవశం
మరువలేని తియ్యని జ్ఞాపకం ||నూతన||

Your favourites

  • No Favourites found!