Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నూతన పరచుము దేవానీ కార్యములు నా Telugu Christian Song Lyrics

నూతన పరచుము దేవానీ కార్యములు నా Lyrics


నూతన పరచుము దేవా
నీ కార్యములు నా యెడల (2)
సంవత్సరాలెన్నో జరుగుచున్నను
నూతనపరచుము నా సమస్తము (2)
పాతవి గతించిపోవును – సమస్తం నూతనమగును
నీలో ఉత్సహించుచు – నీకై ఎదురు చూతును ||నూతన||
శాశ్వతమైనది నీదు ప్రేమ
ఎన్నడైన మారనిది నీదు ప్రేమ (2)
దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా
నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే (2) ||పాతవి||
ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో
నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో (2)
తరములలో ఇలా సంతోషకారణముగా
నన్నిల చేసినావు నీకే స్తోత్రము (2) ||పాతవి||

Your favourites

  • No Favourites found!