Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నూతన సంవత్సరములో యేసు.. నూతన పరచుము Telugu Christian Song Lyrics

నూతన సంవత్సరములో యేసు.. నూతన పరచుము Lyrics

నూతన సంవత్సరములో
యేసు.. నూతన పరచుము నన్ను
నూతన జీవమిచ్చి
నూతన కృపనిమ్మయా (2)
ఆనందమే సంతోషమే
యేసయ్యలో నాకు సంబరమే (2)     ||నూతన||

పాపమంత మన్నించయ్యా
పరిశుద్ధ మనసు నాకు ఇమ్మయ్యా (2)
ప్రభు నీతో నడుచుటకు
నీ సన్నిధిలో ఉండుటకు (2)     ||నూతన||

వాక్యముతో కడుగుమయా
పరిశుద్ధ ఆత్మను నాకిమ్మయ్యా (2)
ప్రభు నీతో నడుచుటకు
నీ సన్నిధిలో ఉండుటకు (2)     ||నూతన||

సత్యముతో నింపుమయా
నీ సాక్షిగ నేనుండుటకు (2)
ప్రభు నీతో నడుచుటకు
నీ సన్నిధిలో ఉండుటకు (2)     ||నూతన||

Your favourites

  • No Favourites found!