Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నువ్వు లేని నన్ను ఊహించలేనునీ ఉన్నత Telugu Christian Song Lyrics

నువ్వు లేని నన్ను ఊహించలేనునీ ఉన్నత Lyrics

నువ్వు లేని నన్ను ఊహించలేను
నీ ఉన్నత ప్రేమను వివరించలేను (2)
అడగాలని నేను అనుకోకముందే
నా అవసరతలు ఎరిగి అక్కరలు తీర్చావు (2)
నా అవసరతలు ఎరిగి అక్కరలు తీర్చావు
యేసయ్యా… నీవే నా ఆరాధ్య దైవమా
యేసయ్యా… నీవే నా ఆధార దీపమా (2) ||నువ్వు లేని||
పదివేలలో అతి సుందరుడా
కురూపినైన నాకు నీ స్వారూప్యమునిచ్చావు
ఎందుకు పనికిరాని వాడనై యుండగా
నీ కుమారునిగా నను స్వీకరించావు (2) ||అడగాలని||
ఏ పాపమును ఎరుగని పరిశుద్ధుడా
ఘోరపాపినైన నాకు పరిశుద్ధత నొసగావు
ఈ లోకము వీడి నిన్ను చేరేంత వరకు
పరిశుద్ధాత్మను నాకు తోడుగా ఉంచావు (2) ||అడగాలని||

Your favourites

  • No Favourites found!