Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఓ క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా Telugu Christian Song Lyrics

ఓ క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా Lyrics


పల్లవి :ఓ క్రైస్తవుడా - సైనికుడా - బలవంతుడా - పరిశుద్ధుడా
కదలిరావోయ్ - నీవు కదలిరా
జాలరి మనుష్యుల పట్టు జాలరీ ... ఆత్మల కాయు కాపరీ
అమృతమంధించే ఆచారీ యేసుకై జీవించే పూజారి


1. సిలువే నీ స్థావరము - శ్రమలే నీ సైన్యము
సహనమే నీ ధైర్యము - సాక్ష్యమే నీ సైన్యము


2. త్యాగమే నీ క్షేమము - ప్రార్థనే నీ యవ్వనము
వాక్యమే నీ బాణము - విశ్వాసమే ఉద్యమము


3. సత్యమే నీ గమ్యము - సమర్పనయే నీ శీలము
యేసే నీ కార్యక్రమము - ప్రేమే నీ పరాక్రమము


4. దేశంలో విదేశం లో - గ్రామంలో కుగ్రామంలో
అడవులలో కొండలలో - పనిఎంతో ఫలమెంతో


5. జయించి లే శరీరాన్ని - ధరించుకో శిరస్త్రాన్ని
బంధించు విషపు సర్పాన్ని - బోధించు యేసు పథకాన్ని


6. సిద్ధాంతపు గట్టు దుమికిరా - సాకులనే మెట్టులు దిగిరా
దీనుడా కాదు ధన్యుడా - విదేయుడా అజేయుడా


7. వాగ్దానపు భూమి స్వతంత్రించుకో - అధ్వాన్నపు అడవి
దాటి ముందుకు పో
నీ ఇల్లే పెనూయేలు - నీ పేరే ఇశ్రాయేలు


8. సంఘమే నీ రంగ స్థలం - సహవాసమే నీ స్థానము
ఏసే నీ నాయకుడు - శుద్దాత్ముడే దర్శకుడు

Your favourites

  • No Favourites found!