Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఓ మానవా నీ పాపం మానవా Telugu Christian Song Lyrics

ఓ మానవా నీ పాపం మానవా Lyrics

ఓ మానవా నీ పాపం మానవా `
యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ‘2’

పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము `
పాపములోనే మరణించినచో తప్పదు మరణము ‘2’
1. ఎంతకాలము పాపములోన బ్రతుకుచుందువు `
ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు
ఎంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు `
ఎంతకాలము దుఖ:ములో మునిగియుందువు
యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము`
యేసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును ‘2’ ‘ ఓ మానవా’

2.ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువు `
ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు
ఎంతకాలము దేవుని మాటను ఎదిరించెదవు `
ఎంతకాలము దేవుని నీవు దు:ఖపరతువు
యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను `
యేసయ్యే నిను రక్షించి పరమున చేర్చును ‘2’ ‘ఓ మానవా ’

Your favourites

  • No Favourites found!