Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఓపాపీ సంధించితివా నీ పాప విమోచకుని Telugu Christian Song Lyrics

ఓపాపీ సంధించితివా నీ పాప విమోచకుని Lyrics

ఓపాపీ - సంధించితివా - నీ పాప - విమోచకుని
నీ పాపముల్ - క్షమించి - నీ ప్రాణమునకు - శాంతినొసగున్
1. బంధింపబడె - ప్రభువైన యేసు - విడుదల జేయనిన్ను
నిందను పొందెను - పొంద నీ వానందము
2. క్రీస్తు యేసు - నీ కొరకేడ్చె - గెత్సెమనే - వనములో
వాత్సల్యముతో - నిన్నానందింపజేయ
3. రక్షకుడు తీర్పుకై - నిలిచె - అక్షయ జీవమీయ
శిక్షను బొందె - నిన్నానందింపజేయ
4. ప్రభువైన యేసు - తట్టుచున్నాడు - నీ హృదయ ద్వారమున్
అబ్బును శాంతి - తెరచిన హృదయమున్
5. జీవజలమిచ్చు - ప్రభువైన యేసు - దప్పిగొనియున్న నీకు
జీవితాంతము వరకు - దప్పిగొన వే మాత్రము
6. రక్షణ దుర్గమున నిన్నుంచి - శత్రువును అణచివేసి
దక్షిణ హస్తముతో - కప్పును - నిన్నెప్పుడు
7. దేవుని స్వరము - వినుడి నేడే - దైవపుత్రులౌదురు
సేవించుడి క్రీస్తుని - జీవితములర్పించి


Your favourites

  • No Favourites found!