Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఓ ప్రభుండా నిన్ నుతీంచుచున్నాము వినయముతోడమా Telugu Christian Song Lyrics

ఓ ప్రభుండా నిన్ నుతీంచుచున్నాము వినయముతోడమా Lyrics



1.
ఓ ప్రభుండా నిన్ నుతీంచుచున్నాము వినయముతోడ
మా ప్రభుండ వంచు నిన్ను మానక మేమొప్పుకొందు ||మో||

2.
నిత్యుఁడవౌ తండ్రి లోకము నిన్నారాధించుచు నుండు
సత్యదూతల్ మోక్షమందు సర్వ ప్రధానుల్ సుభక్తిన్
నిత్య మేక కంఠముతోడ నిన్ గొనియాడుచున్నారు ||ఓ||

3.
పరిశుద్ధ, పరిశుద్ధ పరిశుద్ధ,సేనల దేవా
ధరపరలోకంబులు నీ వర మహిమతో నోప్పునటంచు ||నో||

4.
కెరూబుల్ సెరూపుల్ నిన్నుఁ గీర్తించుచున్నారహహా
సారెకున్ నిన్నపొస్తలుల సంఘము స్తోత్రించుచుండు
కూరిమిన్ బ్రవక్తల సంఘము కొనియాడుచు నిన్ నుతియించు ||నో||

5.
మా మహా జనకా నిను మాన్యుఁడౌ పుత్రున్ బహు ప్రేమగల
మా పరిశుద్ధాత్మను బ్రీతితో సంఘము భువి నొప్పుకొనున్ ||ఓ||

6.
నీవే క్రీస్తు రాజవు నిత్య కుమారుడవు నీ విలలో మానవులను
గావఁగఁ బూనినయపుడు పావన కన్యా గర్భంబున బుట్టుట
బహుదీనంబనక చావు శ్రమ నోడించి సజ్జనులకు దివిఁ దెరచితివే ||ఓ||

7.
నీవు దేవుని కుడి పార్శ్వంబున నిత్యము మహిమాసీనుఁడవు
నీవు మా న్యాయాధిపతివై రావలయునని నమ్ముచుందుము
పావనంబౌ నీ రక్తంబున సేవకులకుఁ దోడ్పడు మిపుడే ||ఓ||

8.
నిత్య మహిమములో నిఁక నీదు భక్తులతోన గత్యముగ లెక్కించుము
వారలఁ గని రక్షించుమి నీ సుజనంబున్ ||ఓ|

9.
నీవు దీవించి నీ నిత్య స్వాస్థ్యంబు సుజీవమిడి వారలఁ
బాలించి లేవఁగ నెత్తుము సతతము ప్రీతిన్ ||ఓ||

10.
ఓ ప్రభువా పాపములో నుండ కుండఁగఁ దోడ్పడుము
మా ప్రభువా కరుణించు మముఁ గరుణించుము దయతోడన్ ||ఓ||

11.
ఓ ప్రభుండా నిన్ను నమ్మి యున్న మాకుఁ బ్రేమఁ జూపు
శ్రీ ప్రభుండా నిన్నే నమ్మితి సిగ్గునొంద నీయకుము ||ఓ||

Your favourites

  • No Favourites found!