Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఓ సంఘమా సర్వాంగమా పరలోకరాజ్యపు ప్రతిబింబమామెస్సయ్యను Telugu Christian Song Lyrics

ఓ సంఘమా సర్వాంగమా పరలోకరాజ్యపు ప్రతిబింబమామెస్సయ్యను Lyrics

ఓ సంఘమా సర్వాంగమా పరలోకరాజ్యపు ప్రతిబింబమా
మెస్సయ్యను ఎదుర్కొనగ నీతినలంకరించి సిద్ధపడుమా
ఓ సంఘమా వినుమా

1. రాణి ఓ ఫేర అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో
వెణావాద్యతరంగాలలో ప్రాణేస్వరుని ప్రసన్నతతో
ఆనంద తైలాసుగంధాభిషేకము నొందితివే సువాసనుండా ||ఓ||

2. స్వస్థపరచే నిర్దోషముగా ముడత కళంకము లేనిదిగా
మహిమ యుక్తంబుగా నిలువగోరె యేసువా
సహించుతావా తీర్పునాడూ ||ఓ||

3. చీకటిలోనుండి వెలుగునకు లోకములో నుండి వెలుపలకు
శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలచెనని
గుర్తించుచుంటివా క్రియలను గంటివా సజీవముగా నున్నావా ||ఓ||

4. వ్యభిచారులు నరహంతకులు పోకిరి చేష్ఠల డాంబికులు
అబద్ధజనకుని యాసనము యెజిబెలు నీ మధ్య నివసించెనా
కృపావరములు ఆత్మల భారములు ఉజ్జీవదాహము కలదా ||ఓ||

5. చల్లగనైనా వెచ్చగనూ ఉండిన నీ కది మేలగును
నులివెచ్చని స్థితి నీకుంటే బయటకు ఉమ్మబడెదవేమో
నీ మనస్సు మార్చుకో తొల్లిప్రేమ కూర్చుకో
ఆసక్తితోడ రక్షణ నొందు ||ఓ||

6. కడపటి బూర మ్రోగగానే కనురెప్ప పాటున మారుదువా
వడిగా మేఘసీనుడవై నడియాకాశము పోగలవా
గొఱ్ఱెపిల్ల సంఘమా క్రీస్తు రాజు సంఘమా రారాజు
నెదుర్కొనగలవా ||ఓ||

Your favourites

  • No Favourites found!