1. ఓ యేసు భక్తులారా,
మీ రాజు ధ్వజము
గ్రహించి సాహసించి
పోరాడి గెల్వుఁడీ
విశ్వాసులార, రండి
మీ రక్షణార్థమై
ప్రయాసపడ్డ యేసు
విజయ మిచ్చును.
2. మీయం దసూయఁ బట్టి
మీ యాత్మ నాశము
నెన్నండుఁ గోరునట్టి
యనేకు లుందురు
మీ రెల్ల రేసు పేరు
వచించి యాయనే
సర్వాధికారి యంచు
సేవింపవలెను.
3. ప్రచండ మైన దండు
పోరాడ లేచినన్
విరోధి శక్తి కొద్ది
మరీ తెగించుఁడీ
స్వకీయ శక్తిఁగాక
శ్రీ యేసు నామమున్
స్మరించి వానియందు
విశ్వాస ముంచుండీ.
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఓ యేసు భక్తులారా,మీ రాజు ధ్వజముగ్రహించి Lyrics
Your favourites
- No Favourites found!
