Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఓ యేసు నీ ప్రేమ ఎంతో Telugu Christian Song Lyrics

ఓ యేసు నీ ప్రేమ ఎంతో Lyrics

ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము
ఆకాశతార పర్వత సముద్రములకన్న గొప్పది
1. అగమ్య ఆనందమే - హృదయము నిండెను
ప్రభుని కార్యములు గంభీరమైనవి
ప్రతిఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు
2. సంకట సమయములో - సాగలేకున్నాము
దయ చూపు నా మీద అని నేను మొరపెట్టగా
వింటినంటివి నా మొరకు ముందే తోడనుందు నంటివి
3. మరణాంధ కారంపు లోయలో నేసంచరించిన
నిరంతరమేసు నాదు కాపరియై
కరమునిచ్చి నన్ను గాయుచు నడుపు కరుణగల ప్రభువు
4. కొదువ లెన్నియున్న భయపడను నే నెపుడు
పచ్చిక బయలులో పరుండ జేయును
భోజన జలములతో తృప్తిపరచును - నాతో నుండు నేసు
5. దేవుని గృహములో సదా స్తుతించెదను
నంపూర్ణ హృదయముతో సదా భజించెదను
స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయ ఆమెన్


Your favourites

  • No Favourites found!