Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఒడ్డుచేరి నీ యెదుట నిల్చునప్డు రక్షకాఒక్క Telugu Christian Song Lyrics

ఒడ్డుచేరి నీ యెదుట నిల్చునప్డు రక్షకాఒక్క Lyrics

1. ఒడ్డుచేరి నీ యెదుట నిల్చునప్డు రక్షకా
ఒక్క యాత్మనైన లేక సిగ్గుపడి పోదునా?
ఒక్క యాత్మనైన నేను - రక్షించక యేసువా
వట్టి చేతులతో నిన్ను - దర్శించుట తగునా?
2. ఆత్మలందు వాంఛలేక - సోమరులై కాలమున్
వ్వర్థపర్చు వారన్నాట - చింతతోడ నిల్తురు
3. యేసువా నా స్వరక్షణ - నిశ్చయంబు ఐనదే
అయిన ఫలితంబు చూడ - కష్టపడక పోతినే
4. కాలమెల్ల గడ్చిపోయెన్ - మోసపోతి నేనయ్యో
గడ్చినట్టి కాలమైతే - ఏడ్చినను వచ్చునా?
5. భక్తులార ధైర్యముతో - లేచి ప్రకాశించుడీ
ఆత్మలెల్ల యేసునొద్ద - చేరునట్లు చేయుడీ

Your favourites

  • No Favourites found!